
తోరణాలు కడుతున్న పూజారులు భక్తులు
నాగులమ్మ మహా జాతర ప్రారంభం
నాగులమ్మ కు ఘనంగా మండె మెలిగే పండగ
ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజలు
ఆదివాసీ పూజారులు వడ్డెలతో ప్రత్యేక పూజలు
ములుగు ప్రతినిధి/మంగపేట, అక్షర సవాల్: నాగులమ్మ మహా జాతర ను ఆదివాసీ పూజారులు వడ్డెలు మంగళవారం మండె మెలిగే పండగను ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామి బాడిశ నాగరమేష్ లు ఘనంగా ప్రారంభించారు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఉదయం నాగులమ్మ ఆలయానికి ముందు తోరణ స్తంభాలను నిలిపి,పసుపు కుంకుమలతో అలంకరించిన గడపను ప్రతిష్టించి వేప, మామిడి మండలతో కట్టిన దండను పూజారులు వడ్డెలు తోరణాన్ని కట్టారు. అనంతరం గోదావరి జలాలతో శుద్ధి చేసిన నాగులమ్మ కు చెందిన కుండలను పసుపు కుంకుమలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో డోలు వాయిద్యాల నడుమ నాగులమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా అమ్మవారి గర్భాలయం మధ్యాహ్నం 12:30గంటలకు మూసి వేసి రాత్రి 8:30గంటలకు ఆలయ శుద్ధి చేసిన అనంతరం అమ్మవారికి పూజలను కొనసాగించారు. ఈ పూజా కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం,కుర్సం పుల్లయ్య కట్టం సమ్మక్క చౌళం భవాని మడకం సుప్రజ పోలిశెట్టి స్వరూప వడ్డెలు కోర్స శ్రీకాంత్ మూయబోయిన శివ తుర్స చిన్నబ్బాయి కారం రాజేష్ ఆదివాసి ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు కొండ చెంచయ్య మద్దెల అంజయ్య జబ్బ రవి గుండం పురుషోత్తం చౌలం కృష్ణమూర్తి కొమరం అశోక్ బొగ్గం సర్వేశం వాసం సారంగపాణి గొప్ప సమ్మారావు మల్లికార్జున రావు కొమరం రామనాధం కులపెద్దలు కుర్సం విష్ణుమూర్తి మడకం రాజేశ్వర్ రావు చౌళం వెంకటేశ్వర్లు ఇందారపు రమేష్ పాల్గొన్నారు.
కుండలను పసుపు కుంకుమలతో అలంకరిస్తున్న వడ్డెలు

