అమ్మవార్లను గుట్టల నుండి తీసుకొస్తున్న పూజారులు
నాగులమ్మ జాతరలో ముఖ్య ఘట్టం మొదలు
గండోర్రె గుట్టలో నాగులమ్మ
ఎర్రెట్టల గుట్టలో సడాలమ్మ
డోలు సన్నాయిలతో ప్రత్యేక పూజలు
ఆదివాసి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎదుర్కోలు
గోదావరి నదిలో పుణ్య స్నానాలు
ములుగు ప్రతినిధి/మంగపేట, అక్షర సవాల్: మండలంలోని లక్ష్మీ నరసాపూర్ గ్రామంలో వెలసినటువంటి నాగులమ్మ జాతరలో రెండవ రోజు ముఖ్య ఘట్టం మొదలైంది. ఆలయ ధర్మకర్త మేనేజింగ్ ట్రస్టీ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామి పర్యవేక్షణలో నాగులమ్మ ప్రధాన పూజారి బాడిశ నాగరమేష్ ఆదివాసీ పూజారులు వడ్డెలు బుధవారం సమీపంలో ఉన్నటువంటి గండోర్రె గుట్ట, ఎర్రెట్టల గుట్టల నుండి నాగులమ్మ సడాలమ్మ లను డోలు సన్నాయి వాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలతో తీసుకొచ్చి ఆదివాసి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి అమ్మవార్లను పవిత్ర గోదావరి నదిలో వివిధ రకాల దళాలతో అభిషేఖాలు పుణ్యస్నానాల అనంతరం నాగులమ్మ గర్భాలయంలోని గద్దెలపై అమ్మవార్లను ప్రతిష్టించారు ఈ కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం కుర్సం పుల్లయ్య కట్టం సమ్మక్క చౌళం భవాని మడకం సుప్రజ పోలిశెట్టి స్వరూప వడ్డెలు కోర్స శ్రీకాంత్ మూయబోయిన శివ,తుర్స చిన్నబ్బాయి కారం రాజేష్ ఆదివాసి కులపెద్దలు కుర్సం విష్ణుమూర్తి మడకం రాజేశ్వర్ రావు చౌళం వెంకటేశ్వర్లు కొమరం మాధవ రావు కొమరం పాపారావు ఇర్ప రామకృష్ణ ఇందారపు రమేష్ భక్తులు పాల్గొన్నారు.
అమ్మవార్లని జెండాలతో ఎదుర్కోలు చేస్తున్న వడ్డెలు


