పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం..
June 29, 2025
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునర్‌వ్యవస్థీకరణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పార్టీ బలోపేతానికి భాగంగా, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కో వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీలను నియమించే విధంగా పార్టీ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో, ఆదిలాబాద్ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గానికి కే.రఘువీర్ రెడ్డి ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యారు.
ఇతర నియామకాల్లో:
కరీంనగర్ – నాయిని రాజేందర్ రెడ్డి (ఎమ్మెల్యే)
జహీరాబాద్ – బండి రమేష్
పెద్దపల్లి – గాలి అనిల్ కుమార్
నిజామాబాద్ – బల్మూరి వెంకట్ (ఎమ్మెల్సీ)
మెదక్ – ఆలం ఖాన్
మల్కాజ్‌గిరి – భసవరాజు సారయ్య (ఎమ్మెల్సీ)
భువనగిరి – కోమటిరెడ్డి వినయ్ రెడ్డి
వరంగల్ – చిట్ల సత్యనారాయణ
మహబూబాబాద్– పొట్ల నాగేశ్వర్ రావు
ఖమ్మం – శ్రావణ్ కుమార్ రెడ్డి
చేవెళ్ల – బొంతు రామ్మోహన్
మహబూబ్‌నగర్ – ఎం. వేణు గౌడ్
సికింద్రాబాద్ – హనుమండ్ల జాన్సీరెడ్డి
హైదరాబాద్ – చిన్నపాటల సంగమేశ్వర్
నాగర్ కర్నూల్ – కొండేటి మల్లయ్య
నల్గొండ – నమిండ్ల శ్రీనివాస్
ఈ నియామకాల ద్వారా, కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంలో కొత్తగా నియమితులైన ఈ నాయకులు కీలక పాత్ర పోషించనున్నారు.