– అంగరంగ వైభవంగా గోదా రంగనాధుని కళ్యాణం
మంగపేట, అక్షర సవాల్:
ధనుర్మాస మహోత్సవాలు భోగీతో ముగియడంతో గోదాదేవి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది నెల రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న గోదాదేవి రంగనాధుని కళ్యాణాన్ని బుధవారం మండలంలోని కమలాపురం శ్రీ సితారామ చంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యుల వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది గోదాదేవి రంగనాధుని కళ్యాణం కమనీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తులు విశేష పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలతో మార్మోగింది.

