– మండల విద్యాశాఖ అధికారిని పొదేం మేనక
మంగపేట, జనవరి17, అక్షర సవాల్:: సీఎం కప్ 2025- 26 అథ్లెటిక్స్ విభాగంలో మంగపేట క్లస్టర్ పరిధిలో నిర్వహించనున్న ఆటలు (కబడ్డీ ఖోఖో వాలీబాల్ ) పోటీలలో పాల్గొనుటకు నమోదు చేసుకున్న అభ్యర్థులు (క్రీడాకారులు ) సోమవారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగపేట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడాకారుల ఎంపికను నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారిని పొదేం మేనక పత్రికా ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నమోదు చేసుకున్న అభ్యర్థులు విధిగా హాజరు కవాలని కోరారు.

