– ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న సూరపనేని నాగేశ్వరరావు
మంగపేట,జనవరి18, అక్షర సవాల్:
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలను ఆదివారం మంగపేట మండల కమ్మ సంఘం, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానుల ఆధ్వర్యంలో మంగపేట మండల కేంద్రంలో, వాడగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గంపోనిగూడెంలో ఎన్టీఆర్ చిత్రపటానికి వాడగూడెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి దేవ కాకతీయ కమ్మ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు సూరపనేని నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు భవనం శ్రీనివాసరెడ్డి, పలువురు ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ నిరుపేదల ఆరాధ్యుడు ఎన్టీఆర్ అని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని, ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన మహానీయుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడి, పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం, తెలంగాణ సమాజాన్ని పట్టిపీడీస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ నిర్మూలన, మండల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన, స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు, బీసీ సాధికారత, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పథకాలు, ఆడపడుచులకు ఆస్థిలో సమాన హక్కు, మహిళా రిజర్వేషన్లు బలపరిచిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుంది. సినీ, రాజకీయ రంగాల్లో మకుటం లేని మహారాజుగా నిలిచిన అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణపతి దేవ కాకతీయ కమ్మ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు సూరపనేని నాగేశ్వరరావు, కమ్మ సంఘం నాయకులు, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు కొత్త గోపాల్ రావు, కొత్త శ్రీనివాసరావు, భవనం శ్రీనివాసరెడ్డి, జాగర్లమూడి నాగేశ్వర రావు, నర్ర శివప్రసాద్, ఎల్వీజీ.నాయుడు, వల్లెపల్లి శివప్రసాద్, తోట రమేష్, నల్లూరి పద్మారావు, బండ్ల మధు ప్రసాద్, మోర్తాల భాస్కరరెడ్డి, పోతుమర్తి రమేష్, దూళిపాల విజయ్, పోలిన హరిబాబు, యడ్లపల్లి నాగేశ్వర రావు, సోంపల్లి రామకోటేశ్వర రావు, గంటా రామారావు, నల్లూరి పేరయ్య, కంచర్ల రాంబాబు, పాలేటి ఆంజనేయులు, పొన్నం రాంబాబు సోలిపురం కుమారస్వామి రెడ్డి, యర్రం నరేందర్రెడ్డి, పొద ధర్మతేజ, కాకర్ల శ్రీనివాసరావు, గోదా శ్రీనివాసరెడ్డి, కాండ్రు నాగేశ్వరావు , ముళ్ళపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


