సర్పంచ్,ఉపసర్పంచ్ లకు గోర్ సేన సన్మానం…

మానుకోట,జనవరి 18 అక్షర సవాల్:
మహబూబాద్ జిల్లాలో ఇటీవల నూతనంగా ఎన్నైకైనా గోర్ బంజారా సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ లకు గోర్ సికవాడి గోర్ సేన ఆధ్వర్యంలో మాన్ పాన్ సన్మాన్ కార్యక్రమము మహబూబాద్ పట్టణంలోని ఆర్తి గార్డెన్ నందు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని అన్ని గిరిజన గోర్ గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ లకు గిరిజన ఆరాధ్యా దైవం సేవలాల్ మహారాజ్ ప్రతిమను బహకరించి, సేలాతో ఘనంగా సన్మానాన్ని నిర్వహించడం జరిగిందని గోర్ సేన జిల్లా అధ్యక్షుడు సురేష్ రాథోడ్ అన్నారు. మొదటగా గిరిజన లంబాడి ఆరాధ్య దైవం అయిన మరియామా యాడి, సేవాలాల్ మహారాజ్ పూజను నిర్వహించి గ్రామంలో గిరిజన అభివృద్ధికి గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన మీరు మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ముఖ్య అతిథి గోర్ సిక్వాడి ముఖ్య ఆర్ సి చౌహాన్ సూచించారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే బాధ్యత గ్రామ పెద్దలుగా మీపై ఉన్నదని సూచించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100కు పైగా వివిధ గ్రామాల సర్పంచ్ ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కుణ్సొత్ హాటియా నాయక్, పరశురామ్ నాయక్, భోజ్య నాయక్, బిక్కు నాయక్, హరిలాల్ నాయక్, సురేష్ నాయక్, సాగర్ చౌహాన్ నాయక్, ఠాగూర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

