యూత్ ఐడియాథాన్ లో డి.పి.ఎస్ వరంగల్ విద్యార్థుల ప్రతిభ..
వరంగల్, అక్షర సవాల్:
పెండ్యాల లోని డి.పి.ఎస్ వరంగల్ సి.బి.ఎస్.ఈ పాఠశాల విద్యార్థులు, ఆదివారం ఐ.ఐ.టి ఢిల్లీలో, థింక్ స్టార్టప్ మరియు సి.బి.ఎస్.ఈ. లు సంయుక్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక యూత్ ఐడియాథాన్ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని పాఠశాల చైర్మన్ శ్రీ రవి కిరణ్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేసారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఎస్ వరంగల్ విద్యార్థులు మేధా పెండ్యాల మరియు జోయా తహ్మీనా లు పాల్గొన్నారు. అధ్యాపకుడు కాసిపేట మనోజ్ రాజ్ గారి సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో విద్యార్థులు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘ఫామ్ లింక్’ అనే యాప్‌ను అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఈయాప్ ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. రైతులు నేరుగా మార్కెట్లతో అనుసంధానం కావడం, సరైన ధరలు పొందడం వంటి అంశాల్లో ఈయాప్ కీలక పాత్ర పోషింస్తుందని విద్యార్థులు వివరించారు.విద్యార్థులు తమ వినూత్న ఆలోచనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. ఈ ఆలోచన దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు నిపుణుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగ అభివృద్ధికి వినియోగించే దిశగా ఈ ప్రాజెక్ట్ ఆదర్శంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వి. రవి కిరణ్ రెడ్డి గారు , ప్రిన్సిపాల్ డా.. ఇన్నారెడ్డి గారు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.


