శాలువా కప్పి సన్మానిస్తున్న నాయకులు
ఏఎస్పీ ఎస్ఐ లను కలిసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న
మంగపేట/ఏటూరునాగారం,మార్చి 06, అక్షర సవాల్:
ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో బదిలీపై వచ్చిన ఏఎస్పి మనన్ బట్, ఎస్ఐ మహేష్ లు నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువ కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి నేరచరిత్ర లేని మండలంగా తీర్చిదిద్దాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు సీనియర్ నాయకులు యువజన నాయకులు మహిళా నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

