Trending Now
Thursday, January 29, 2026

Buy now

Trending Now

జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలి : ఎస్పి

-నేటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ. 

-ప్రజలు ప్రశాంత వాతావరణం లో దరఖాస్తులు పెట్టుకునేలా భద్రతా చర్యలు.

-భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించిన ఎస్పి కిరణ్ ఖరే.

భూపాలపల్లి, డిసెంబర్ 28 (అక్షర సవాల్):

నేటి నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలనకు సంబందించి పోలీస్ బందోబస్తు, ప్రజా పాలన నిర్వహణ తీరును జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  కిరణ్ ఖరే  గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ, రాంనగర్ మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ఎస్పి  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా అర్హులైన ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి కిరణ్ ఖరే  కోరారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహరెడ్డి పాల్గొన్నారు.

Related Articles

Latest Articles