రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
– ముగ్గురికి తీవ్ర గాయాలు
మంగపేట, జనవరి 21, అక్షర సవాల్

మంగపేట, జనవరి 21, అక్షర సవాల్:
ఎదురెదురు వేగంతో వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన మండలంలోని చుంచుపల్లి శివారులో చోటుచేసుకుంది సంఘటన స్థలంలోని వ్యక్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో భద్రాద్రి టీ కొత్తగూడెం ( పినపాక మండలం) గ్రామానికి చెందిన పానేం ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటాపురం మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వడంతో వారిని 108 అంబులెన్స్ లో ప్రథమ చికిత్స కొరకు ఏటూరునాగారం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న పానేం ప్రకాష్ బంధువులు మృతదేహాన్ని (టాటా మ్యాజిక్) ట్రాలీ ఆటోలో ఏటూరునాగారం ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని తెలిపారు.



