Trending Now
Thursday, January 29, 2026

Buy now

Trending Now

జర్నలిస్టులకు టీ షర్ట్ లు పంపిణీ

జర్నలిస్టులకు టీ షర్ట్ లు పంపిణీ

 

– మంత్రి సీతక్క

మేడారం/మంగపేట, జనవరి 28, అక్షర సవాల్:

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో బుధవారం జాతరను కవరేజ్ చేస్తున్న వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టు లకు, మీడియా ప్రతినిధులకు మంత్రి సీతక్క టీ షర్ట్ లను పంపిణీ చేశారు మంత్రి సీతక్క మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంమైన సమక్క సారలమ్మ జాతర కు భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు ములుగు జిల్లాలో నిర్వహించే జాతర లో ప్రస్తుత సంవత్సరం అనేక మార్పులు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఆదివాసుల అస్థిత్వం, ఆత్మగౌరవం, పూజ విధానం లో మార్పు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు జాతర కు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డు విస్తరణ, మెరుగైన పారిశుధ్య చర్యలు, విద్యుత్ దీపాలంకరణ, క్యూ లైన్ సౌకర్యాలు మెరుగయ్యాయని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర తీసుకొచ్చే విధానం పూజ వ్యవహారాలలో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు 4 రోజులు జరిగే సమక్క సారలమ్మ జాతరకు ప్రస్తుత సంవత్సరం 40 రోజుల సరిపడా ఏర్పాట్లు చేశామని అన్నారు భక్తులకు అవసరమైన టాయిలెట్స్, త్రాగు నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు అదనపు కార్మికులను ముందుగానే జాతర స్థలం వద్ద సిద్ధం చేశామని అన్నారు.  సమక్క సారలమ్మ జాతరకు ఇప్పటి వరకు 20 లక్షల భక్తులు వచ్చారని అంచనా వేశామని అన్నారు.సమక్క సారలమ్మ జాతర కవర్ చేసే అదృష్టం పాత్రికేయులకు కలిగిందని, జాతర యొక్క ఔన్నత్యం గొప్పతనాన్ని బయట ప్రపంచానికి మీడియా చాటి చెప్పాలని మంత్రి తెలిపారు. రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సమయానికి మీడియా కు సైతం పెద్ద హాల్, మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి. ఎస్. జగన్, ఉప సంచాలకులు వెంకటేశ్వర్లు, వెంకట సురేష్ సంబంధించిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles