మేడారం ఓ జన సముద్రం
– ప్రారంభమైన మహా ఘట్టం
మేడారం/మంగపేట, జనవరి 28, అక్షర సవాల్:
మేడారం జాతర మహా ఘట్టం బుధవారం ప్రారంభమైంది పవిత్రమైన ఈరోజు మేడారం ఓ జన సముద్రంగా మారింది. తెలంగాణ కుంభమేళగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహా జాతర మేడారం అక్కడ గుడి లేదు గోపురం లేదు అర్చన లేదు అభిషేకం అంత కన్నాలేదు తీర్థం లేదు తీయని లడ్డూ లేదు.మడి లేదు మంగళహారతి లేదు కొలవడానికి ఓ రూపం లేదు కలవడానికి ప్రత్యేక దారులు లేవు కాని ఉన్నదల్లా ఒక నమ్మకం “సమ్మక్క సారక్క” అంటే ఒక నమ్మకం ఈ నమ్మకంతోనే ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుండి భక్తులు కొన్ని కోట్లల్లో వస్తుంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమన్న కుట్టదంటారు తల్లి ఆశీస్సులతో వచ్చిన భక్తులకు చీమ కాదు కదా ఒక దోమ కూడ కుట్టదని భక్తుల నమ్మకంతోనే ఈ మహా జాతర మరో రెండు రోజుల్లో కుంభమేళగా మారనున్నది.





