పుణ్యస్నానం శాపంగా మారింది!
మేడారం/మంగపేట, జనవరి 28, అక్షర సవాల్:
మేడారం జాతరలో భక్తుల సంబరాలు అంబరాన్ని అంటుతున్న తరుణంలో బుధవారం జంపన్న వాగులో విషాదఛాయలు అలముకున్నాయి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మంచిర్యాల జిల్లాకు చెందిన కిరణ్ (45) కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దర్శనానికి మేడారనికి చేరుకున్నారు మేడారం జంపన్నవాగులో పుణ్యస్నానం కోసం వాగులో దిగిన కిరణ్ నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన జాతరలోని భక్తులలో తీవ్ర దిగ్భ్రాంతిని నెలకొల్పింది పుణ్యస్నానం కాస్త శాపంగా మారింది కళ్లముందే జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల భక్తులు భయాందోళనకు గురయ్యారు.


