మేడారంలో నాలుగో సింహం ఫోకస్
– మేడారం జాతర ట్రాఫిక్ పై క్షేత్ర స్థాయి పర్యవేక్షణ
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
మేడారం/మంగపేట, జనవరి 28, అక్షర సవాల్:
మేడారం జాతరకు తరలివస్తున్న వాహనాల రద్దీ బుధవారం భారీగా పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా జాతర ట్రాఫిక్ పై (నాలుగో సింహం ) వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.పస్రా, తాడ్వాయి మార్గమధ్యంలో వాహనాల రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆయా సెక్టార్ అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు.

