అయోధ్య తరహాలో భద్రాచలం అభివృద్ధి
27న రామయ్య కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి
భద్రాచలం, అక్షర సవాల్:
దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. సుమారు రూ. 350 కోట్ల వ్యయంతో ఆలయ మాస్టర్ ప్లాన్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అయోధ్య రామాలయాన్ని తలపించేలా ఆలయ ప్రాంగణ విస్తరణ, మాడ వీధుల నిర్మాణం, క్యూ కాంప్లెక్స్ వంటి పనులను చేపట్టనున్నారు.ఈ నెల 27న జరగనున్న శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. అదేవిధంగా 28న జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి అవసరమైన రూ. 34 కోట్ల నిధులను భూసేకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసింది.

