రూ10 లక్షల విలువైన వెంట్రుకల చోరీ
నలుగురు నిందితుల అరెస్ట్
వరంగల్ క్రైమ్, అక్షర సవాల్ : వరంగల్ నగరంలోని బట్టల బజార్లో గల శ్యామల ఎంటర్ప్రైజెస్ షాపులో అక్రమంగా చొరబడి, యజమానిపై దాడి చేసి సుమారు 10 లక్షల రూపాయల విలువైన వెంట్రుకలను దోచుకెళ్లిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మట్వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ తెలిపారు.
కేసు వివరాలను ఆయన వెల్లడిస్తూ
ఫిర్యాదుదారుడైన నాగిశెట్టి కుమారస్వామి బట్టల బజార్లో ‘శ్యామల ఎంటర్ప్రైజెస్’ పేరుతో వెంట్రుకల వ్యాపారం నిర్వహిస్తున్నారు. గతంలో Registration షేక్ బషీరా (ఏ 1) తో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ఈ క్రమంలో బషీరా సుమారు 3.5 లక్షల రూపాయలు కుమారస్వామికి చెల్లించారు. అయితే, కొంతకాలంగా కుమారస్వామి ఆమెకు వెంట్రుకలు సరఫరా చేయకుండా, వేరే వ్యక్తితో వ్యాపారం సాగిస్తుండటంతో, తమ డబ్బు లేదా సరుకును ఎలాగైనా వసూలు చేసుకోవాలని నిందితులు పథకం వేశారు.
నేరం జరిగిన తీరు:
గత నెల ఫిబ్రవరి 09, 2026 సాయంత్రం 5:00 గంటల సమయంలో, నిందితులు షేక్ బషీరా (ఏ -1), షేక్ సలీమా (ఏ -2), షేక్ నయీమ్ అలియాస్ లాడెన్ (ఏ -3) మరియు కొత్తపల్లి నాగన్న (ఏ -4) పథకం ప్రకారం మహబూబాబాద్ నుండి వరంగల్‌కు వచ్చారు. కుమారస్వామి షాపులోకి అక్రమంగా ప్రవేశించి, ఆయన్ని దూషించి, భౌతికంగా దాడి చేసి, షాపులో ఉన్న 3 బ్యాగుల వెంట్రుకలను (విలువ సుమారు రూ. 10 లక్షలు) బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. నిందితులను అరెస్టు చేసి
దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దోచుకెళ్లిన వెంట్రుకలను ఇప్పటికే విక్రయించగా వచ్చిన రూ. 5,80,000/- నగదును పోలీసులు వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
* షేక్ బషీరా (A-1): వయస్సు 45 ఏళ్లు, మహబూబాబాద్.
* షేక్ సలీమా (A-2): వయస్సు 40 ఏళ్లు, మహబూబాబాద్.
* షేక్ నయీమ్ @ లాడెన్ (A-3): వయస్సు 21 ఏళ్లు (డిగ్రీ విద్యార్థి).
* కొత్తపల్లి నాగన్న @ నాగయ్య (A-4): వయస్సు 39 ఏళ్లు (మేస్త్రీ పని).
నిందితులపై BNS సెక్షన్లు 296(b), 329(4), 309(6) కింద కేసులు నమోదు చేసి, వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు.


