Trending Now
Friday, September 6, 2024

Buy now

Trending Now

భూపాలపల్లి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
— భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి జూలై 21 (అక్షర సవాల్):
ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు, చెరువులు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రోడ్లపైకి నీరు చేరే ప్రాంతాల్లో రవాణా నియంత్రణ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని జలాశయాలు నీటి మట్టానికి చేరుకున్నాయని, వీక్షణకు ప్రజలకు అనుమతి లేదని, నియంత్రణ చేయాలన్నారు.
పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని, జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు సహకరించాలని వారు పేర్కొన్నారు. అన్ని శాఖలు, పోలీసుశాఖ ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు, చెరువులు, వాగులు, నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో సేవలందించేందుకు కలెక్టరేట్ నందు 24 గంటలు పనిచేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము నంబర్లు 9030632608, టోల్ ఫ్రీ 18004251123లకు ఫోన్ చేయాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు ఉండొద్దని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు .

Related Articles

Latest Articles