మట్వాడ పి ఎస్ లో మహిళా దినోత్సవ వేడుకలు..
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సీఐ కర్ణాకర్
వరంగల్ క్రైమ్, అక్షర సవాల్ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మట్వాడ పోలీస్ స్టేషన్లో ఘనంగా జరిగాయి. ఆదివారం వరంగల్ నగరంలోని మట్టే వాడ పోలీస్ స్టేషన్లో మహిళ పోలీసులతో కలిసి సీఐ కర్ణాకర్ కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా మణులు అన్ని రంగాల్లో మగవారితో పోటీపడుతూ.. ప్రపంచ స్థాయికి ఎదిగారని, పోలీసు విభాగంలో ఎంతో హుందాతనముతో డ్యూటీలు చేస్తున్నారని, మహిళ అబల కాదు.. సబల అని నిరూపించు కొని ఒక శక్తిగా ఎదిగారన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

