విద్యార్థినిగా మారిన మహిళా ఎస్సై అమూల్య
అక్షర సవాల్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య, విద్యార్థిని వేషధారణలో (స్టూడెంట్ గెటప్) పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖాకీ యూనిఫాం వదిలి, ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని సాధారణ విద్యార్థినిలా వెళ్లారు. పోలీసులు ఏ రూపంలోనైనా మన పక్కనే ఉంటారని నిరూపించిన ఎస్సై అమూల్య ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని స్థానికులు అభినందిస్తున్నారు. ఇది ఆకతాయిలకు ఒక గట్టి హెచ్చరిక అని వారు పేర్కొంటున్నారు.

