Trending Now
Sunday, March 22, 2026

Buy now

Trending Now

అడవి తల్లి అడుగు పెట్టిన వేళ

అడవి తల్లి అడుగు పెట్టిన వేళ 

– కాళ్ల గజ్జలు కదం తొక్కిన వేళ

– డప్పుల సప్పులతో పాదం కలిపిన వేళ

– నిలువెత్తు బంగారం ఎత్తుకున్న వేళ

– మేడారం పుడమి పున్నమి వెన్నెల విరబూసిన వేళ

మేడారం/మంగపేట, జనవరి 30, అక్షర సవాల్:

అడవి తల్లి ఆదివాసి బిడ్డలు శ్రీ  సమ్మక్క సారక్క అడుగు పెట్టిన వేళ  మేడారం పుడమి ఒక పున్నమి వెన్నెలల  ప్రతి బింబిస్తుంది ప్రతి రెండు (ఏళ్లకు)  సంవత్సరాలకు ఒక సారి ( నింగి) చిలకల గుట్టల నుంచి పుడమితల్లి పై అడుగు పెట్టిన వేళ మేడారం డప్పుల సప్పులతో నిలువెత్తు బంగారం నెత్తిన పెట్టుకొని కాళ్లకు గజ్జలు కట్టి విరకోల చేత పట్టుకొని మువ్వల సవ్వడితో చేసే నృత్యాన్ని చూస్తుంటే ఒళ్ళు పులకరింపులతో కదం తొక్కాలనిపిస్తుంది చుట్టూ జనాలు ఎటు చూసినా ఎత్తు బంగారం దుకాణాలు జంపన్న వాగులో భక్తుల పూనకాలతో కోలాహలల మధ్య పుణ్య స్థానం ఆచరించి గజ్జల లాగు ధరించి ఎత్తు బంగారం నెత్తిన పెట్టి ఒడిబియ్యం,ఈరగోళ చేతపట్టి గజ్జలు కట్టిన కాళ్లతో గళ్ళు గళ్ళు మంటూ అమ్మ వారి దర్శనానికి వెళ్తుంటే సాక్షాత్తు” శ్రీ సమ్మక్క సారక్క”  లు మేడారంలో నడిచి వస్తున్న అనుభూతినిస్తుంది భక్తులు కోరిన కోర్కెలు తీర్చాలంటూ తల్లికి మేకలను, కోళ్లను ఎదురించి కోళ్లను గాలిలో ఎగరేస్తు పడుతున్న సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటారు హిజ్రాల ఆటపాటల సందడి, గాలిలో తిరుగుతున్న రంగులరాట్నం జాతకాలు చెప్పే కోయదొర ఇలాంటివి మరెన్నో మన మేడారంలో చూడొచ్చు.

 

Related Articles

Latest Articles