Trending Now
Sunday, March 22, 2026

Buy now

Trending Now

బస్సుల కోసం ప్రయాణికుల ఇక్కట్లు

బస్సుల కోసం ప్రయాణికుల ఇక్కట్లు

మేడారం/మంగపేట, జనవరి 30, అక్షర సవాల్:

రాష్ట్ర నలుమూలల నుండి మేడారం మహా జాతర ను దర్శించుకోవడానికి వచ్చి పోయే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో భక్తులకు ఎలాంటి ఆసౌకార్యాలు కలగకుండా ఉండాలని వందల ఎకరాల విస్తీర్రమైన భూమిలో ఆర్టీసీ బస్టాండ్ ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ బస్సుల సమయపాలన లోపంతో జాతరకు వచ్చి వెళ్తున్న భక్తులకు చేదు అనుభవాలను మిగులుస్తుంది మేడారం మహా జాతర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయం పడుతుంటే మరోవైపు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి బూడిదలో పోసిన పన్నీరుల తయారైంది ఆర్టీసీ అధికారులు బస్సులను సమయపాలన పాటించకుండా నడుపుతూ ప్రయాణికులను ఇక్కట్లకు గురి చేస్తున్నారని పలువురు బహిరంగానే చెప్పుకుంటున్నారు.

 

 

 

 

 

 

Related Articles

Latest Articles