Trending Now
Tuesday, February 10, 2026

Buy now

Trending Now

“హెల్మెట్ “పెట్టుకో “గిఫ్ట్” పట్టుకో

“హెల్మెట్ ” పెట్టుకో “గిఫ్ట్”పట్టుకో..– హెల్మెట్ శిరస్సుకు రక్ష  మీ కుటుంబానికి శ్రీరామరక్ష

– సీటు బెల్టు తప్పనిసరి

– మంగపేట ఎస్సై తిరునగరి వెంకట రంగయ్య సూరి

మంగపేట, పిబ్రవరి 10, అక్షర సవాల్:

హెల్మెట్ లేని, సీటు బెల్టు లేని ప్రయాణం నేరం, నిదానమే ప్రధానం అతి వేగం ప్రమాదకరం, ఇలాంటి పాత సూక్తులను పక్కన పెట్టి పోలీస్ శాఖ మంగపేట వారు “హెల్మెట్” పెట్టుకో “గిఫ్ట్” పట్టుకో అనే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంగపేట ఎస్సై తిరునగరి వెంకట రంగయ్య సూరి వాహన చోదకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. అయినప్పటికీ వాహన చోదకులు రోడ్డు భద్రత నియమావళిని పక్కన పెడుతున్నారు పోలీసులు వాహనాలపై చాలన్లు విధించిన కేసులు నమోదు చేసినా చెవి పెడన పెడుతున్నారు. హెల్మెట్ ధరించడం శిరస్సుకు రక్ష అదే మీ కుటుంబానికి శ్రీరామరక్ష అని మరో మారు వాహనదారులకు తెలియ చెప్పాలన్న ఉద్దేశంతో ఇలాంటి వినూత్న ఆలోచన చేయడం ఫ్రెండ్లీ పోలీసులుగా మా బాధ్యత దీనిలో అసలు విషయం ఏమిటంటే “హెల్మెట్ ” పెట్టుకో “గిఫ్ట్” పట్టుకో అనే దానిలో గిఫ్ట్ (బహుమతి) అంటే మీరు సురక్షితంగా ఇంటికి చేరడమే మీ కుటుంబానికి మీరిచ్చే పెద్ద బహుమతి గా భావించాలని అన్నారు.

Related Articles

Latest Articles