పురుగుల మందు తాగిన అయ్యగారు
వరంగల్ అక్షర సవాల్: సర్పంచ్ వేధింపులతో వేద పండితులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఎనుగల్ గ్రామంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ తొర్రి పద్మ వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు .గత 35 ఏళ్లుగా గ్రామ రెవెన్యూ పరిధిలోని’వన్ మెట్టు’వద్ద శ్రీరామ నవమి కళ్యాణ వేడుకలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.అయితే ప్రస్తుత సర్పంచ్ పాలకవర్గంతో చర్చించకుండా,ఏక పక్షంగా వేదికను మార్చాలని నిర్ణయించడం గ్రామస్తుల అగ్రహానికి కారణమైంది.ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా ఆలయ పురోహితులు వెంకన్నచార్యులుతో సర్పంచ్ పద్మ గొడవకు దిగడం,వారిని అవమానించడం జరిగిందని,సర్పంచ్ వేధింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన వెంకన్నచార్యులు పురుగుల ముందు తాగడం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు.ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
నేను చెప్పించే శాసనం:
నేను చెప్పించే శాసనం అంటూ సర్పంచ్ గ్రామ ప్రజలను బెదిరిస్తున్నారని,సంప్రదాయాలను తుంగలో తొక్కడం సరికాదని అదే గ్రామానికి చెందిన మూడవ వార్డు సభ్యులు తొర్రి లక్ష్మణ్ యాదవ్,గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకన్నచార్యుల వైద్య ఖర్చులన్నీ సర్పంచే భరించాలని,శ్రీరామ నవమి కళ్యాణాన్ని పాత పద్ధతిలోనే,దచ్ మెట్టు వద్దే నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ పై కలెక్టర్ వెంటనే చర్యలు చెపట్టాలని వారు కోరారు.


