ఎన్ ఎస్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు
ఉచిత కంటి వైద్య శిబిరం
ములుగు ప్రతినిధి అక్షర సవాల్ : ఇండస్నాక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు, మాజీ ఎంపిటిసి నునావత్ మహేష్ నాయక్ అన్నారు. ఆదివారం ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండల కేంద్రంలో ఎన్ ఎస్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. సుమారు 100 మందికి పైగా పేషెంట్లు హాజరై కంటి పరీక్ష చేయించుకున్నారు. దాదాపు 59 మందికి కంటి ఆపరేషన్లు చేయాలని డాక్టర్లు నిర్ధారించారు. కంటే ఆపరేషన్‌కు అర్హులైన వారందరిని హైదరాబాదులోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యాన్ని అందజేస్తామన్నారు. ఎన్ ఎస్ నాయక్ ఆశయాలకు అనుగుణంగా తమ చారిటబుల్ ట్రస్ట్ అన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. వారి ఆశయాలను ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నునావత్ రవీందర్, వైద్యులు, పేషెంట్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

