Trending Now
Sunday, February 15, 2026

Buy now

Trending Now

అందంగా ముస్తాబైన శైవ క్షేత్రం 

అందంగా ముస్తాబైన శైవ క్షేత్రం 

– విద్యుత్ దీపాలతో ముస్తాబు

మంగపేట, పిబ్రవరి15, అక్షర సవాల్: మహా శివరాత్రి పర్వదిన వేడుకల సందర్భంగా మండలంలోని శ్రీ ఉమా చంద్ర శేఖర స్వామి ఆలయాన్ని శనివారం నుండే విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకు ఎల్ఈడి తెరలపై కనుల పండువగా చూసి తరించే అవకాశాన్ని ఆలయ కమిటీ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోలగట్ల నరేష్ రెడ్డి మాట్లాడుతూ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య ఘట్టమైన జ్వాలా తోరణం ఏర్పాటుకు ప్రత్యేకమైన ఎండు గడ్డి కర్ర స్తంభాలతో ఎంతో పవిత్రంగా భావించి ఏర్పాటు చేస్తారు జ్వాలా తోరణం జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద నుంచి శివ పార్వతుల పల్లకీని భుజస్కందాలపై మోస్తూ భక్తులు సంతోషిస్తుంటారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి సహాయ సహకారాలు అందించిన భక్తులకు ఆ నీలకంఠుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ కోరుకుంటుందని అన్నారు.

 

Related Articles

Latest Articles