Trending Now
Sunday, February 15, 2026

Buy now

Trending Now

గుండ్ల సింగారంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

గుండ్ల సింగారంలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

హనుమకొండ ఫిబ్రవరి 15 అక్షర సవాల్: బాలాజీ బంజారా కాలనీ గుండ్ల సింగారం సేవాలాల్ ప్రాంగణం లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ని కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్ బంజారా పెద్దలు, నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు బంజారా సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు రవి నాయక్ రాజు నాయక్, జవహర్లాల్, లాలూ నాయక్, వీ ఎన్ నాయక్, జవహర్లాల్, రమేష్, మాట్లాడుతూ, మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం తమకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందని తెలిపారు. సేవ, త్యాగం, నీతి, నిజాయితీ వంటి విలువలను సమాజానికి బోధించిన మహనుభావుడు సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మార్గదర్శకుడు, ఆధ్యాత్మిక దిక్సూచి అని కొనియాడారు.

సేవాలాల్ మహారాజ్ సమాజంలో ఐక్యత, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు కృషి చేశారని, ఆయన బోధనలు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ మాట్లాడుతూ ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం గుడి నిర్మించేందుకు ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ని విజ్ఞప్తి చేయాలని కార్పొరేటర్ గ్రామ ప్రజలు నాయకులకు కలిసి గుడి నిర్మాణం కొరకు కృషి చేద్దామని అన్నారు.లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ మాట్లాడుతూ యువత సేవా భావంతో ముందుకు రావాలని, విద్య, క్రమశిక్షణ, ఐక్యత ద్వారా సమాజాన్ని అభివృద్ధి పరచాలని, సేవాలాల్ మహారాజ్ ఆశయాలను నిలబెట్టడం మనందరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ మహారాజ్ కి ఘన నివాళులు అర్పిస్తూ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసి భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించిన కార్పొరేటర్ లావుడియా అనుష రవి నాయక్, బంజారా బంధుమిత్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ వీ ఎన్ నాయక్, గౌరవ అధ్యక్షులు పోరిక జవహర్ లాల్ నాయక్, సేవాలాల్ పూజారి బానోతు శాంతి లాలు నాయక్, నునావత్ జయంతి జవహర్లాల్ నాయక్, పొరిక రమేష్ నాయక్, గుగులోతు వెంకన్న నాయక్, నునావత్ మానస రవి, బోడ రాజేందర్, హరిలాల్ నాయక్, పులి రాజు, ప్రతాప్, దేవ్ సింగ్, వెంకటియా, రమేష్ నాయక్, కిషన్ నాయక్, పోరిక వనిత రవినాథ్, భూక్య మౌనిక మురళి, ఈర్య నాయక్, బానోతు చుక్కమ్మ చొక్లా నాయక్, రామచంద్రు నాయక్, ధర్మానాయక్, బిక్షపతి, లోకేష్, సుమన్, రవీందర్, బాలమణి, సునీత,కవిత, అరుణ, విమల, సరిత, రాధిక, మానస, రమేష్, రాజు, విజయ, లక్ష్మణ్, బాలు, బుజ్జమ్మ, సురేష్, మంజినాయక్, గోదారి, బిల్డర్ రాజు నాయక్, మోహన్ నాయక్, జయంతి, రమా, మాన్సింగ్ నాయక్, మొదలైన నాయకులు గ్రామ ప్రజలు సేవాలాల్ జయంతిలో పాల్గొని విజయవంతం చేశారు

Related Articles

Latest Articles