సేవాలాల్ మహారాజ్ ఆశయాలను అనుసరించాలి..
– మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ్ నాయక్
నర్సంపేట, అక్షర సవాల్: సత్ గురు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను నెరవేర్చాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ్ నాయక్ అన్నారు.జయంతి సందర్బంగా డా. ఉదయ్ సింగ్, అంగోత్ భద్రయ్య, బజ్జుతండా సర్పంచ్ జాటోత్ రవి లతో కలిసి నర్సంపేట పట్టణం లో బైక్ శోభా యాత్ర తో పాటు భోగ్ బండారో కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ ఆశయాలను నెరవేర్చాలని, ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణo జరగాలన్నారు.
భోజ్య నాయక్ తండా లో విగ్రహ ప్రతిష్టాపన
భోజ్యనాయక్ తండా నందు సేవాలాల్ మహారాజ్ నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. సేవాలాల్ మందిరం నిర్మాణానికి బంజారా పూజారులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండావాసులు .. పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో అజ్మీరా శ్రీనివాస్,బానోత్ రమేష్,శ్యాం సింగ్,చందర్ సింగ్, కళ్యాణ్,లావణ్ కుమార్,సురేష్ తదితరులు పాల్గొన్నారు..


