Trending Now
Tuesday, February 24, 2026

Buy now

Trending Now

నాగర్‌ కర్నూల్ జాతర ఘటనపై నిరసనలు

నాగర్‌ కర్నూల్ జాతర ఘటనపై నిరసనలు

– బాధ్యులపై కఠిన చర్యల డిమాండ్

నెక్కొండ, ఫిబ్రవరి 23 అక్షర సవాల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో జరిగిన కుమ్మరి మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా చోటుచేసుకున్న దాడి ఘటనపై వివిధ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దైవ దర్శనం కోసం జాతరకు వెళ్లిన ఒక కుటుంబంపై దాడి చేసి,ఓ చిన్నారి మృతికి కారణమైన ఘటనను ఖండిస్తూ నెక్కొండలోని చాకలి ఐలమ్మ సెంటర్ వద్ద పలువురు బహుజన,కుల సంఘాల నాయకులు సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదునూరి యాకయ్య మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొల్లెపెళ్లి శ్రావణ్ కుమార్,రామారపు భద్రయ్య, బొడ్డుపెళ్లి రాజు,రామారపు విజయ్,పైండ్ల కుమార్,రామారపు సంతోష్,కోడూరి నాగరాజు,పైండ్ల విజయ్,పొట్లపల్లి రాజు,రామారపు రఘు,బండి రామస్వామి,పొట్లపల్లి వీరాస్వామి,నస్పూరి‌ తిరుపతి తదితరులు పాల్గొని ఘటనను ఖండించారు.

Related Articles

Latest Articles