[pj-news-ticker]
Thursday, April 16, 2026

Buy now

గురుకుల పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు

గురుకుల పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు

నెక్కొండ, అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల-కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ వి.రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలను ఆయన తిలకించి,వారి సృజనాత్మకత,ఆవిష్కరణా త్మక ఆలోచనలను అభినందించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను చిన్ననాటి నుంచే అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.తార్కిక ఆలోచన విధానం,అన్వేషణ దృక్పథం పెంపొందించుకుంటేనే శాస్త్ర రంగంలో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల-కళాశాల ప్రిన్సిపాల్ జి.శ్రీదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Related Articles

Latest Articles