మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమ్మాలగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు, జాతర మహోత్సవాల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు వైభవంగా శాంతియుతంగా జాతర సాగేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది.
కొమ్మాల జాతరకు పటిష్ట భద్రత ఏర్పాటు
ప్రభ బండ్ల ప్రదేశాలను పరిశీలించిన ఈస్ట్ జోన్ డీసీపీ
గీసుగొండ, మార్చి 1 అక్షర సవాల్:
మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమ్మాలగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు, జాతర మహోత్సవాల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. వైభవంగా, శాంతియుతంగా జాతర సాగేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. జాతరలో ప్రధాన ఆకర్షణైన ప్రభ బండ్ల ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆదివారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభ బండ్లను నిలిపే ప్రదేశాలను స్వయంగా తనిఖీ చేసి, పార్టీల వారీగా తగినంత దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
భద్రతపై ప్రత్యేక దృష్టి
వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వాహనాల రాకపోకలకు ఎక్కడా అంతరాయం కలగకుండా క్రమబద్ధీకరణ చేపట్టాలని ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.సమన్వయంతో ముందుకు ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, జిల్లా నాయకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి, గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజకుమార్ డీసీపీతో కలిసి పాల్గొన్నారు. జాతర విజయవంతానికి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. లక్షలాది భక్తులకు తాగునీరు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని అన్ని శాఖలకు సూచనలు జారీ అయ్యాయి ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

