Trending Now
Friday, August 29, 2025

Buy now

Trending Now

టి.ఎస్.జే.యు నాయకులకు ఘన సన్మానం.

ఎన్.యు.జె(ఐ) జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న టి.ఎస్.జే.యు నాయకులకు ఘన సన్మానం.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ఆగస్ట్ 8 అక్షర సవాల్ : బీహర్ లో జరిగిన నేషనల్ జర్నలిస్ట్ యూనియన్(ఇండియా )జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరై తిరిగివచ్చిన తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్ట్రటరి పావుశెట్టి శ్రీనివాస్,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి జల్దీ రమేష్ లను గురువారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుడు పైడిపల్లి రమేష్,స్థానిక జర్నలిస్ట్ లు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన సమస్యలపై గలమెత్తి,జర్నలిస్ట్ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా జర్నలిస్ట్ లను వారు అభినందించారు. ఈ సందర్భంగా టీ.ఎస్.జే.యూ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తడుక సుధాకర్, బెల్లం తిరుపతి, బండారి రాజు, మేడ వెంకట స్వామి, కనుకుల దేవేందర్, మొకిడి చిరంజీవి, దొమ్మటి రవి, స్టాఫ్ ఫోటో గ్రాఫర్ లు పి.మధుసూదన్, బండ మోహన్, కాటారం రిపోర్ట్లు అరిగేల జనార్దన్, సుధాకర్, ఇంతియాజ్, దివ్యంగుల స్టేట్ జనరల్ సెక్ట్రటరి కొయ్యడ. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles