ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు..
మాజీ జెడ్పిటిసి గృహంలో అంబరాన్నంటిన సంబరాలు
హనుమకొండ, అక్షర సవాల్ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు హనుమకొండలో అంగ రంగ వైభవంగా జరిగాయి. ఆదివారం హనుమకొండలోని మాజీ జెడ్పిటిసి గుగులోతు వీరమ్మ గోపి సింగ్ స్వగృహంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఎన్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా కేక్ కట్ చేయించి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని. ఈ పోటీ ప్రపంచంలో మహిళలపై అన్నారు.ఈ కార్యక్రమంలో వీరమ్మ గోపి సింగ్, నునావత్ జవహర్లాల్, లావుడియా పల్లవి రాజు నాయక్ మూడు రమేష్, ధన్ సింగ్ శారద, వీరమ్మ గోపి సింగ్, అర్పిత లక్ష్మణ్ నాయక్, అర్చన నందిరాం నాయక్, మాలతి రాజు నాయక్, సుజిత తిరుపతి, అన్నపూర్ణ రామారావు, నాగేశ్వరి వెంకటేశ్వర్లు, అనసూయ జగ్రామ్, మాట్లాడుతూ, ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారన్నారు. దుర్గబాయ్ దేశ్ ముఖ్ ,ఝాన్సీ రాణి ,ఇందిరాగాంధీ వంటి మహిళలునేటి మహిళలు ఆదర్శం అన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు గౌరవం, గుర్తింపు ఖచ్చితంగా ఇవ్వాలని పెర్కొన్నారు. ప్రతీ మహిళల ఆర్థిక, రాజకీయహక్కులు , సామాజికం గా ఎదగాలని పిలుపు నిచ్చారు.



