శాయంపేట ఉప సర్పంచ్ కుటుంబానికి మానవతా పరామర్శ
గీసుగొండ, మార్చి 8 అక్షర సవాల్:
శాయంపేట(హ) గ్రామ ఉప సర్పంచ్ రాజబోయిన రాము అకాల మరణం గ్రామానికి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు తెలిపారు. ఇటీవల మరణించిన రాము కుటుంబాన్ని ఆదివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు సందర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి మానవతా దృక్పథంతో 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. నాయకులు, కష్టకాలంలో పేద కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాలి యాకయ్య, ప్రస్తుత ఉప సర్పంచ్ ఊరుగొండ అనిత మురళి, గ్రామ పార్టీ అధ్యక్షులు జూల రమేష్ పాల్గొన్నారు. వారితో పాటు వార్డ్ సభ్యులు గాలి అనిల్, కొంగర సారిబాబు, సుధామల్ల పవన్, తాళ్లపెల్లి చంద్రమోహన్, మాజీ ఎంపీటీసీ కాగిత బిక్షపతి, దాడి శివ తదితరులు మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు.

