Trending Now
Sunday, February 15, 2026

Buy now

Trending Now

భక్తుల నోట శివనామస్మరణలు…!

భక్తుల నోట శివనామస్మరణలు…! 

– పంచామృలతో అభిషేకాలు

– కిటకిటలాడిన  శైవ క్షేత్రాలు

– మహిళల కటిక ఉపవాస దీక్షలు

– భక్తజనులకు ప్రత్యేక ఏర్పాట్లు

మంగపేట, పిబ్రవరి15, అక్షర సవాల్:అత్యంత విశిష్టమైన పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినమైన ఆదివారం మండల కేంద్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు మంగపేట శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే వచ్చే భక్తజనులతో కిట కిటలాడుతుంది దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఆసౌకార్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ కోలగట్ల నరేష్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తవత్సలుడైన మహా పరమశివుని దర్శించుకోవడానికి చుట్టు పక్కల గ్రామాల నుండి  భక్తులు తండోప తండాలుగా తరలివస్తున్నారు.ముఖ్యంగా మహిళలు కటిక ఉపవాస దీక్షను ఆచరించి బోలా శంకరుని దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు విస్సావజ్జల నరేష్ శర్మ పంచామృలతో అభిషేకాలు గోత్రనామ అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణమంత ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, సాంబ సదాశివ నమశ్శివాయ అంటూ శివనామస్మరణలతో మార్మోగుతోంది.

 

 

Related Articles

Latest Articles