మండలంలో పర్యటించనున్న రెవెన్యూ అడిషనల్ కలెక్టర్
– తహసీల్దార్ తోట రవీందర్
మంగపేట, పిబ్రవరి17, అక్షర సవాల్: రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మహిందర్ జీ బుధవారం మండల కేంద్రంలో పర్యటించనున్నట్లు మంగపేట తహసీల్దార్ తోట రవీందర్ పత్రిక ప్రకటనలో తెలిపారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న సందర్భంగా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ తో మండల పుర ప్రముఖులు, గ్రామ పెద్దలచే ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ సమావేశంలో ఆయా గ్రామ పెద్దల సలహాలు సూచనలు సేకరణ చేయడం జరుగుతుందని తహసీల్దార్ అన్నారు.

