Trending Now
Tuesday, February 24, 2026

Buy now

Trending Now

పాదపూజతో గురువులకు సన్మానం

పాదపూజతో గురువులకు సన్మానం

 

– పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

వరంగల్, ఫిబ్రవరి 24 అక్షర సవాల్ :

వరంగల్ లోని ఆర్యవైశ్య ఉన్నత పాఠశాల 1996 నుండి 1997 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ సమ్మేళనాన్ని పూర్వ విద్యార్థులు వినూత్నంగా నిర్వహించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో గురువులకు పాద పూజ చేసి వారి గురుభక్తిని విద్యార్థులు చాటుకున్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వి.ఎల్. నరసింహచార్యులు మాట్లాడుతూ, 30 సంవత్సరాల క్రితం పదో తరగతి చదివిన విద్యార్థులు పాఠశాలను, ఉపాధ్యాయులను గుర్తించుకొని అందరూ కలిసి వచ్చి గురుభక్తిని చాటు కావడం గొప్ప విశేషం అని అన్నారు. అంతేకాకుండా గురువులకు పాద పూజ చేసి తాము ఎప్పటికీ మర్చిపోని జ్ఞాపకాన్ని ఆనందాన్ని ఉపాధ్యాయులందరికీ అందించారు. ఈ పూర్వ విద్యార్థులు వివిధ రంగాలలో స్థిరపడినా అందరూ వీలు చూసుకుని వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించటం అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింద న్నారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్ , రామ్మోహన్, రామలింగం, విమలాదేవి, పూర్ణిమ, బాలరాజు, సెక్రటరీ రాజేశ్వరరావు విద్యార్థులు శరత్, శ్రీకర్, సదానందం, రాఘవ , డా. రాధ, రమాదేవి , రాధిక , శ్రీదేవి , అశోక్, సురేష్ , తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles