పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
నెక్కొండ, ఫిబ్రవరి 23 అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సందర్భంగా అవసరమైన ప్యాడ్లు,పెన్నులు తదితర పరీక్షా పరికరాలను నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, ప్రియదర్శిని యూత్ క్లబ్ కన్వీనర్ చల్లా రఘోత్తమ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నెక్కొండలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సహాయం అందిస్తున్న చల్లా రఘోత్తమ రెడ్డిని అభినందించారు. పేద విద్యార్థులకు స్వంత ఖర్చులతో పరీక్షా సామగ్రి అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రియదర్శిని యూత్ క్లబ్ కన్వీనర్ చల్లా రఘోత్తమ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు రేపటి భవిష్యత్తు అని,జీవితంలో విజయాన్ని సాధించాలంటే స్వయంకృషి,ఏకాగ్రత,క్రమశిక్షణ అవసరమని సూచించారు.విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి,ఉపాధ్యాయులు ఐలయ్య,రిటైర్డ్ ఉద్యోగి మహమ్మద్ మదార్,మాజీ విద్యా కమిటీ చైర్మన్లు గరికపాటి కృష్ణారావు,కుడికాల కుమారస్వామి,వార్డు సభ్యుడు ముద్రబోయిన శ్రీకాంత్,చల్లా కిషన్ రెడ్డి,తాళ్లపెల్లి భాస్కర్,సారయ్య,పలుసం నర్సయ్య,మహమ్మద్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.


