Trending Now
Thursday, February 26, 2026

Buy now

Trending Now

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు…

అక్షర సవాల్ బ్రేకింగ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు…

 

వరంగల్ బ్యూరో,అక్షర సవాల్ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అవసరాల దృష్ట్యా ఐఏఎస్ అధికారుల విస్తృత స్థాయి బదిలీలు చేపట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (ప్రత్యేక విభాగం) శాఖ జీఓ ఆర్.టి. నెం..290 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీల తో పాటు నియామకాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

1. సంజయ్ కుమార్‌ను పరిశ్రమలు, ఐటీ & వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుండి పీఆర్ & ఆర్‌డీ, ఆర్‌డబ్ల్యూఎస్ & ఆర్‌ఎస్‌ఏడీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.

2. సబ్యసాచి ఘోష్ పదవిని ఫ్లాగ్‌షిప్ సంక్షేమ & అభివృద్ధి పథకాల అమలు విభాగంతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) బాధ్యతలతో పునర్నియమించారు.

3. ఎం. దాన కిషోర్‌ను విపత్తు నిర్వహణ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

4. ఎన్. శ్రీధర్‌ను ఐటీ & పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గనులు & భూగర్భశాఖ అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు.

5. రాహుల్ బోజ్జాను సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసి, బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.

6. ఈ. శ్రీధర్‌ను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమించారు.

7. డా. గౌరవ్ ఉప్పల్‌ను ఆర్థిక & ప్రణాళిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేసి, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ & మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.

8. బి. విజయేంద్రను మహబూబ్‌నగర్ కలెక్టర్ పదవి నుండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి & షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా నియమించారు.

9. డి. దివ్యకు ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి అదనపు బాధ్యతలు అప్పగించారు.

10. అద్వైత్ కుమార్ సింగ్‌ను తెలంగాణ భవన్, న్యూఢిల్లీ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.

11. ఎం. హనుమంతరావును ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ చేసి, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి బాధ్యతలు అప్పగించారు.

12. సిక్తా పట్నాయక్‌ను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.

13. సందీప్ కుమార్ ఝాను జనగాం కలెక్టర్‌గా నియమించారు.

14. ఎం.డి. ముషర్రఫ్ అలీ ఫారూఖీని కొత్త డిస్కమ్ చైర్మన్ & ఎండీగా నియమించారు.

15. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెలా సత్పథిని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేశారు.

16. అనురాగ్ జయంతిని యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియమించారు.

17. రాహుల్ రాజ్ పి.ఎస్‌ను సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ & సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమించారు.

18. భావేష్ మిశ్రాను ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పునర్నియమించారు.

19. జితేష్ వి. పాటిల్‌ను టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ & ఎండీగా నియమించారు.

20. రిజ్వాన్ బాషా షేక్‌ను జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.

21. సంతోష్ బి.ఎం.ను గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా నియమించారు.

22. ప్రతీక్ జైన్‌ను నారాయణపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు.

23. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా నియమించారు

24. పి. కాత్యాయనీ దేవిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.

25. జి. ఫణీంద్ర రెడ్డిని నారాయణపేట అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా బదిలీ చేశారు.

26. చిత్ర మిశ్రాను కరీంనగర్ కలెక్టర్‌గా నియమించారు.

27. గరిమా అగ్రవాల్‌ను రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు.

28. దీపక్ తివారిని వికార్‌బాద్ కలెక్టర్‌గా నియమించారు.

29. ప్రతిమ సింగ్‌ను మేడక్ కలెక్టర్‌గా నియమించారు.

30. అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియమించారు.

మహా వరంగల్ 

31. చాహత్ బాజ్‌పాయ్‌ను హనుమకొండ కలెక్టర్‌గా నియమించి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించారు

32. ఖుష్బూ గుప్తాను మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమించారు.

33. మంద మకరందును జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

34. ఫైజాన్ అహ్మద్‌ను మెడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా నియమించారు.

35. శివేంద్ర ప్రతాప్‌ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

36. పర్మార్ పింకేశ్‌కుమార్ లలిత్‌కుమార్‌ను జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా నియమించారు.

37. ఉమాశంకర్ ప్రసాద్‌ను వికార్‌బాద్ అదనపు కలెక్టర్‌గా నియమించారు.

38. జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్‌ను నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌గా నియమించారు.

39. పి. చంద్రయ్యను మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు.

40. వై.వి. గణేష్‌ను వరంగల్ అదనపు కలెక్టర్‌గా నియమించారు.

41. అబ్దుల్ హమీద్‌ను సిద్ధిపేట అదనపు కలెక్టర్‌గా నియమించారు.

42. బి. వెంకటేశ్వర్లును నిర్మల్ అదనపు కలెక్టర్‌గా నియమించారు.

43. ఎన్. ఖీమ్యా నాయక్‌ను వనపర్తి అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు.

44. కె. విద్యాసాగర్‌ను ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ & స్పీడ్ అదనపు సీఈఓగా నియమించారు.

45. ఎం. సురేందర్‌ను ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియమించారు.

ఈ బదిలీలతో రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనలో మార్పులు చోటుచేసుకున్నాయి.

Related Articles

Latest Articles