కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం
మంగపేట, మే 28, అక్షర సవాల్:
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరాలు అంటూ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.మంగపేట మండలంలో గురువారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులను మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు మండల తహసిల్దార్ తోట రవీందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1లక్షా 116 లు ఆ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు అందుకున్న కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచంద్ర వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణి స్థానిక తాసిల్దార్ తోట రవీందర్ రెవిన్యూ శాఖ సిబ్బంది మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు చెక్కు అందిస్తున్న మంత్రి సీతక్క

