బీటెక్‌లో మరో 9వేల సీట్లు
హైదరాబాద్ జూలై 26 అక్షర సవాల్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 9,000 బీటెక్ సీట్ల కల్పనకు కసరత్తు పూర్తయింది. ఇవి నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ మొదలవుతుంది. 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. కాగా ఈ రెండు రోజుల్లోనే విద్యాశాఖ నుంచి కొత్త సీట్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

