Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

టూరిజం ప్రాంతంగా మారనున్న మల్లూరు గుట్ట 

వేదమంత్రాలతో స్వాగతం పలుకుతున్న ఆలయ అర్చకులు

టూరిజం ప్రాంతంగా మారనున్న మల్లూరు గుట్ట 

అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం

ములుగు జిల్లా పర్యాటక ప్రాంతాలకు నెలవు

రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మంగపేట,మార్చి 01, అక్షర సవాల్:

మంత్రుల పర్యటనలో భాగంగా మండలంలోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మల్లూరు గుట్టను ఆదివారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, మంత్రులు దర్శించుకున్నారు అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలసంతోషంగా ఉందన్నారు ములుగు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలు నెలవై ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మేడారం జాతరను అద్భుతంగా 200 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండే విధంగా అభివృద్ధి చేసుకొని, మేడారం మహా జాతర విజయవంతం కావడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని దేవాలయాలను బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని వాటికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. స్థానిక మంత్రి సీతక్క చొరవతో మల్లూరు గుట్టను అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఎస్ పి సుధీర్ రామనాథ్ కేకన్ అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జీ ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రులతో మాట్లాడుతున్న ఆలయ ఈవో రేవెల్లి మహేష్

Related Articles

Latest Articles