Saturday, April 11, 2026

Buy now

పెన్షన్ల పంపిణీ కోసం పడిగాపులు

పెన్షన్ల పంపిణీ కోసం పడిగాపులు

పోస్టుమాస్టర్‌పై ప్రజల ఆందోళన

నెక్కొండ, అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ పోస్టాఫీస్‌లో పోస్టుమాస్టర్ నిర్లక్ష్యం హద్దుమీరిందని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు గురువారం పోస్టాఫీస్ ఎదుట భారీ ఆందోళన చేపట్టారు.గ్రామస్తులు, మహిళలు,వృద్ధులు పెద్ద సంఖ్యలో గుమికూడి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.పోస్టల్ సేవలు పూర్తిగా స్తంభించాయని,ముఖ్యంగా మనీ ఆర్డర్లు,ఇతర లావాదేవీలు తీవ్ర ఆలస్యానికి గురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.పోస్టుమాస్టర్ రత్నమాల సమయానికి కార్యాలయానికి రాకపోవడం వల్ల ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆరోపించారు.వృద్ధాప్య,వితంతు,వికలాంగుల పెన్షన్ల పంపిణీలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని దీనివల్ల పేదలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అసలే వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో,పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వారికి కనీసం త్రాగునీటి సదుపాయం కూడా కల్పించకపోవడంతో వృద్ధులు,లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యాలయానికి వచ్చే ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా వారు మండిపడ్డారు. “వద్దు మాకొద్దు… పోస్టుమాస్టర్ రత్నమాలను వెంటనే బదిలీ చేయాలి”అంటూ నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టాఫీస్ సేవలను తక్షణమే సరిచేసి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ ఆందోళనలో గ్రామస్తులు దాసరి శ్రీనివాస్,రవిబాబు,వరుణ్,శ్రీకాంత్,వినోద్,చందపాషా,వీరమ్మ,నూర్జహాన్,విజయరాణి,కుమార్,కట్టయ్య,మహిళలు,వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Latest Articles