దేశానికి అన్నం పెట్టే రైతే రాజు
రైతునే రాజుగా చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం
ఐకేపీ సెంటర్లో వడ్ల కొనుగోలుకు సహకరించాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య
మంగపేట, అక్షర సవాల్: దేశానికి అన్నం పెట్టే రైతే రాజు వరి పండించే రైతునే రాజుగా చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు. మండలంలోని అఖినేపల్లి మల్లారం వివేక రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో వరి సాగు చేసే రైతన్న కు క్వింటా సన్న వడ్ల కు 500 రూపాయలు బోనస్ ఇస్తూ రైతులకు రెండు లక్షల రూపాయలు రైతు ఋణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మకాల సమయంలో ఒక్కో క్వింటాకు 8 నుండి 10 కేజీల తగ్గింపు ఉండేది ఇప్పుడు అలాంటి తగ్గింపులు ఉండవు సాగు చేసిన రైతన్నలు ఐకెపి సెంటర్లకు సహకరించాలని దళారులను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి ఫైషల్ హుసన్ జిల్లా మేనేజర్ కృష్ణవేణి మంగపేట మండల తహసీల్దార్ తోట రవీందర్ మండల ప్రజా పరిషత్ అధికారి బద్రు నాయక్ స్థానిక ఎస్సై టీవీఆర్ సూరి వ్యవసాయ అధికారి చేరాలు ఏఈఓ భావన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఎఫ్ పి ఓ సెంటర్ ఇంచార్జి నాసిరెడ్డి సంబశివారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



