సర్పంచ్‌లకు స్పష్టమైన మార్గదర్శకాలు
పారదర్శక వినియోగమే లక్ష్యం
గీసుగొండ, ఏప్రిల్ 19 అక్షర సవాల్: గీసుగొండ మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల సమర్థ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి (డిఎల్పిఒ) వేదవతి మేడం సర్పంచ్‌లకు నిధుల వినియోగ విధానంపై సమగ్రంగా వివరించారు. గ్రామ అభివృద్ధి పనుల్లో నిధులను పారదర్శకంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి పాక శ్రీనివాస్ కూడా పాల్గొని గ్రామ స్థాయి అభివృద్ధి పనుల్లో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సర్పంచ్‌లను కోరారు. సమావేశంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ ఆపరేటర్లు పాల్గొని వివిధ అంశాలపై అవగాహన పొందారు.



