గీసుకొండ పోలీసుల దాడి
నలుగురు అరెస్ట్
ఇద్దరు వ్యక్తులు పరారీ
నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం
గీసుకొండ, ఏప్రిల్ 19 అక్షర సవాల్: పేకాట శిబిరాలపై గీసుకొండ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం కొమ్మాల గ్రామ శివారులో నిర్వహించిన సంయుక్త దాడిలో నలుగురిని అరెస్ట్ చేసి, ఇద్దరు పరారైన ఘటన చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు గీసుకొండ పోలీసులు, వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి కడారి రాజు వ్యవసాయ భూమిలో నడుస్తున్న పేకాట శిబిరంపై అకస్మిక దాడి చేపట్టారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా, ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. అరెస్ట్ చేసిన వారిలో కడారి రాజు, దునికే కొమురయ్య, బసికే ప్రభాకర్, లకావత్ గణేష్ ఉన్నారు. పరారీలో వాంకుడోత్ రాజు, పల్లె నరేష్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడి సందర్భంగా నిందితుల వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు, 4 మోటార్ సైకిళ్లు, రూ. 4,840 నగదు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.


