[pj-news-ticker]
Friday, May 29, 2026

Buy now

నిరుపేద కుటుంబాలకు వరాల జల్లు 

నిరుపేద కుటుంబాలకు వరాల జల్లు 

అర్హులైన లబ్ధిదారులకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు

వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి.

మంగపేట, మే 28, అక్షర సవాల్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరుపేద కుటుంబాలకు వరాల జల్లు కురిపించింది.ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సంఘ సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణి మంగపేట తహసీల్దార్ తోట రవీందర్ ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles