వరుస దొంగతనాలు.. చేదించిన పోలీసులు
8 మంది వ్యక్తులు అరెస్టు
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం
జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ప్రశంసలు
మంగపేట, మే 29, అక్షర సవాల్:
మండలంలోని గంపొనిగూడెం కమలాపురం బోరనర్సాపూర్ పలు గ్రామాల్లో జరిగిన వరుస బంగారం, వెండి ఆభరణాల దొంగతనాలను చేసిన దొంగలను మంగపేట పోలీసులు ఏంతో చాకచక్యంగా వ్యవహరించి 8 మంది వ్యక్తులు అరెస్టు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఈ దొంగలపై గతంలో చాలా కేసులు నమోదై వున్నాయని నిందితులు కమలాపురం, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన వారిగా గుర్తించినట్లు వారి వద్ద నుండి 1తులం 1/2 బంగారం 40 తులాల వెండి వస్తువులు మూడు బైక్ లు 30 కిలోల కాపర్ వైర్ మూడు సెల్ ఫోన్లు రూ 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం సిఐ అనుమల శ్రీనివాస్ తన కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ శ్రీనివాస్ మంగపేట ఎస్సై టివిఆర్ సూరి ఏఎస్ఐ శ్రీకాంత్ లు మాట్లాడుతూ వేసవికాలంలో ఆరుబయట నిద్రించే సమయంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాటిని చేదించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు ఏటూరునాగారం ఏఎస్పి శ్రీ మనాన్ భట్, సిఐ అనుమల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టివిఆర్ సూరి, ఏఎస్ఐ శ్రీకాంత్ పోలీసు సిబ్బంది మోహన్ రమేష్ ప్రసాద్ నరేష్ లను జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ప్రశంసించారు.
స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

