[pj-news-ticker]
Wednesday, April 22, 2026

Buy now

కొమ్మాల జాతరలో తప్పిపోయిన బాలుడు సురక్షితం

కొమ్మాల జాతరలో తప్పిపోయిన బాలుడు సురక్షితం

తల్లికి అప్పగించిన పోలీసులు

గీసుగొండ, అక్షర సవాల్:

కొమ్మాల జాతరలో తప్పిపోయిన మూడు సంవత్సరాల బాలుడు రియాన్స్ సురక్షితంగా దొరికాడు. హసన్పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన నన్నబోయిన శిరీష తన కుమారుడు రియాన్స్‌తో కలిసి జాతరకు రాగా, జనసమ్మర్దంలో బాలుడు తప్పిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడిని గుర్తించి, రక్షణ కల్పించారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా బాలుడి వివరాలను ప్రకటించి, తల్లి శిరీషకు క్షేమంగా అప్పగించారు. తన బిడ్డను అప్పగించిన పోలీసులకు తల్లి మరియు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్య గమనిక:

జాతరకు వచ్చే భక్తులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లల జేబులో వారి పేరు, ఫోన్ నంబర్ కలిగిన చిట్టీలను ఉంచాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Latest Articles