Trending Now
Monday, March 9, 2026

Buy now

Trending Now

గీసుగొండలో మానవత్వం

గీసుగొండలో మానవత్వం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత

గీసుగొండ, అక్షర సవాల్: మండల కేంద్రానికి చెందిన తాటికొండ విమల మరణంతో ఆ కుటుంబంలో ఏర్పడిన విషాదాన్ని చూసి స్థానిక దాతలు, నాయకులు స్పందించారు. అనారోగ్య కారణంగా మరణించిన విమల అంత్యక్రియల ఖర్చుల కోసం గీసుగొండకు చెందిన ప్రముఖులు ఆర్థిక సహాయం అందించడంతో తమ ఉదారతను చాటుకున్నారు. గ్రామ శ్రీమంతుడు పెగళ్లపాటి లక్ష్మీనారాయణ మృతురాలి కుటుంబ పరిస్థితిని తెలుసుకొని మానవత్వంతో స్పందించారు. ఆయన తన వంతు సహాయంగా రూ. 5,000/- నగదు పంపగా, ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి కూడా మృతురాలి కుమారుడిని పరామర్శించి, అంత్యక్రియల కోసం రూ. 5,000/- ఆర్థిక సహాయం అందించారు. ఈ సేవా కార్యక్రమంలో గీసుగొండ సోషల్ సర్వీస్ టీం ప్రతినిధులు కర్ణకంటి రామమూర్తి, ముల్క సత్యనారాయణ, మాజీ ఎంపిటిసి దౌడు భరత్ పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక పెద్దలు చాడ సంజీవరెడ్డి, బోడకుంట్ల కుమారస్వామి, కందికొండ మొగిలి, కర్ణకంటి సత్యనారాయణ, బ్రహ్మచారి కోటి, బెజ్జెంకి బ్రహ్మయ్య, బిక్షపతి ఆచార్యులు, పోలీసు బాబూరావు, తాటికొండ నరేందర్, శంకర్, వేముల నరేందర్ రెడ్డి, చినగారి సంపత్ తదితరులు పాల్గొని మృతురాలి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్న లక్ష్మీనారాయణ, కొమురారెడ్డి లను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

Latest Articles